Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

టెన్నికాయిట్‌ రాష్ట్ర జట్టుకు స్థానిక విద్యార్థుల ఎంపిక

విశాలాంధ్ర- గూడూరు : మల్లవోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా( ఎస్‌ జీ ఎఫ్‌ ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి టెన్నికాయిట్‌ అండర్‌ 14, అండర్‌ 17, విభాగాల్లో స్థానిక పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అండర్‌ -14 విభాగంలో డి. రమ్య, అండర్‌- 17, విభాగంలో పి. త్రినాథ్‌, పి. అలేఖ్య, ఆర్‌ .దేవి పల్లవి లు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విద్యార్థులు, పీ ఈ టీ సిద్దినేని. శ్రీనివాసరావు, మురళి లను హెచ్‌ఎం వెంట్రపాటి .పాండురంగారావు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img