Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

వ్యవసాయ శాఖ గ్రామసభ

విశాలాంధ్ర – గూడూరు: గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో గురువారం ఆర్ బి కె చైర్మన్ అందే. రాము మరియు గ్రామ సర్పంచ్ యక్కల. మాధవి నాగరాజ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ తుమ్మల.బ్రహ్మం మాట్లాడుతూ ఈ ఏడాది కనీస మద్దతు ధర సాధారణ రకము( కామన్) క్వింటాల్ 2040 రూపాయలు గాను, గ్రేడ్ ‘ఏ ‘రకము క్వింటాల్ 2060 రూపాయలు. పంట నమోదు జాబితాలో ఏవైనా మార్పులు ఉంటే రాతపూర్వకంగా గ్రామ వ్యవసాయ సహాయకులకు తెలపాలన్నారు. ఈ క్రాఫ్ చేసిన రైతుల వివరాలు గ్రామ సచివాలయాల వద్ద, ఆర్ బి కేల వద్ద నోటీస్ బోర్డుల్లో పెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తేజవతి మధు గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img