Monday, December 5, 2022
Monday, December 5, 2022

ఎర్రచెరువు అక్రమార్కుల పాలిట కల్పతరువు

. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తొలకాలు
. స్పందించని అధికారులు?

విశాలాంధ్ర-మైలవరం: మండలంలోని ఎర్రచెరువు అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది వాస్తవానికి చెరువుల ద్వారా ఆయకట్టు కింద పంటలు పండించే రైతులకు ప్రయోజనం పొందే వారు.నేడు అవే చెరువులు అక్రమంగా మట్టి తరలించే వారికి కాసులు కురిపిస్తున్నాయి.ఈ ఎర్రచెరువులో మట్టితో పాటు రోడ్లకు వేసేందుకు ఉపయోగించే గ్రావెల్ కూడా లభించడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఎర్రచెరువు నుండి మైలవరంలో ప్రైవేటు స్థలాలు, వెంచర్లకు రాత్రుళ్ళు యథేచ్ఛగా మట్టిని అక్రమార్కులు ట్రక్కు రూ.1500/-వరకు అమ్ముకుంటూ కాసులు దండుకుంటున్నారు.అమె అక్రమార్కులను అరికట్టాల్సిన అధికారులు విధులకు దూరంగా ఉదాసీనంగా వ్యవహరిస్తూ పరోక్షంగా అక్రమార్కులకు సహకరిస్తున్నారు.

ఈ అక్రమాల విషయమై ఇరిగేషన్ ఎ ఇ ఫోన్ చేసిన సదరు అధికారిణి కూడా స్పందించరు? గ్రామంలోని వి ఆర్ ఓ లు కూడా చెరువుల్లో భారీ ఎత్తున మట్టి తవ్వకాలు, తొలకాలు జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలు, తొలకాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img