Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్రీడా పోటీలను ప్రారంభించిన విప్ ఉదయ భాను

విశాలాంధ్ర – జగ్గయ్యపేట: స్ధానిక జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ గ్రౌండ్ లో వున్న ఏపీజే అబ్దుల్ కలాం ఇండోర్ స్టేడియం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించే జగనన్న క్రీడా సంబరాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట నియోజకవర్గం శాసన సభ్యులు సామినేని ఉదయభాను వారి తనయులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్,రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్ లజమ్ లు బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు,మూడు రోజులు పాటు క్రీకెట్,కబడ్డీ,వాలీబాల్ తదితర క్రీడలను నిర్వహించడం జరుగుతుందని,నియోజకవర్గ స్థాయిలో ఆడి గెలిచినవారు అనంతరం జిల్లా,జోనల్,రాష్ట్రస్థాయిలో గెలుపొందాలని ఇలా గెలిచిన వారికి లక్ష రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు నగదు బహుమతిని వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు,ఇలా క్రీడాకారులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందివ్వాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు, అదేవిధంగా మన నియోజకవర్గంలోని క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో గెలిచి జగ్గయ్యపేటకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరం గేమ్స్ కో – ఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఆటలు పోటీలకు పూర్తి సహాయ సహకారాలు అందించారని, క్రీడాకారులకు మధ్యాహ్నం భోజనం,యూనిఫామ్, కూడా ఏర్పాటు చేశారని,జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను ఒకచోటకు చేర్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వవిప్ సామినేని ఉదయభానుకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,రాష్ట్ర పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి,జడ్పిటిసి ఊట్ల నాగమణి, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్ పట్టణ మహిళా అధ్యక్షురాలు ముసిని రాజ్యలక్ష్మి,కౌన్సిలర్ నూకల సాంబ,మోరే బాబి,కోఆప్షన్ సభ్యులు ఖాదర్ బాబు,పట్టణ సమైక్య అధ్యక్షురాలు షేక్ మునిహేర,సర్పంచులు సూర్య ప్రకాష్,నరసింహారావు,సర్కిల్ ఇన్స్పెక్టర్ అడపా మురళి, ఎస్సై రామారావు,గేమ్స్ కోఆర్డినేటర్ శ్రీనివాసు గంటా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img