Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రతి ఒక్కరు విద్యా వ్యాప్తి కి కృషి చేసి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

యల్ బి ఆర్ సి ఇ ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు

విశాలాంధ్ర – మైలవరం: ప్రతి ఒక్కరు విద్యా వ్యాప్తికి కృషి చేసి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మరియు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం (నవంబరు 11) ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారని ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు తెలిపారు,
శుక్రవారంనాడు “జాతీయ విద్యా దినోత్సవం“ సందర్బంగా కళాశాల యన్.యస్ యస్.యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ భారత రత్న “మౌలానా అబుల్ కలాం ఆజాద్“ భారతదేశంలో విద్యా విధానంలో నూతన ఒరవడి సృష్టించారని, ఆయన నిర్ణయాల వల్ల అక్షరాస్యత బాగా పెరిగిందని మరియు ప్రతి ఒక్క విద్యార్ధి విద్యా, వినయంతో పాటు మంచి నడవడికను అలవర్చుకొని ఉన్నత స్దానాలకు చేరుకోవాలన్నారు,

కళాశాల యన్ .యస్ .యస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.బి.శివ హరి ప్రసాద్ ప్రసంగిస్తూ “మౌలానా అబుల్ కలాం ఆజాద్ “ భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్దానాన్ని సంపాదించారని ,ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేసి నిరక్షరాస్యతను సమూలంగా నిర్మూలించి విద్యా వికాసానికి తోడ్పడాలన్నారు,

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.కె.హరినాధ రెడ్డి , డీన్ అకాడమిక్స్ డా.యమ్ శ్రీనివాస రావు ఆర్ & డి డీన్ డా.ఈ.వి.కృష్ణా రావు, మరియు శ్రీ.ఎస్ .ఉమామహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img