Friday, April 26, 2024
Friday, April 26, 2024

అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను పట్టుకున్న నందిగామ పోలీసులు

విశాలాంధ్ర రూరల్ – ఎన్టీఆర్ జిల్లా నందిగామ : అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని ఆలోచనతో యువత తమ మంచి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని డిసిపి మేరీ ప్రశాంతి అన్నారు గురువారం పోలీస్ స్టేషన్లో ఏసీపి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఇటీవల మండల పరిధిలోని చందాపురం గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును త్వరితగతిన చేదించిన పోలీసులను ఆమె అభినందించి రివార్డులను అందజేశారు నందిగామ మండలం చందాపురం గ్రామంలో ఒక వృద్ధురాలు మెడలో నుంచి చైన్ స్నాచింగ్ ఘటనపై ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసి సిసి ఫుటేజ్ సెల్ఫోన్ ఆధారంగా 16 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న నలుగురు ఖమ్మం జిల్లాకు చెందిన వారిని అరెస్ట్ చేసి 30 లక్షల విలువచేసే అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు వారిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు ఈ పాత్రికేయుల సమావేశంలో నందిగామ సిఐ సతీష్, ఎస్సైలు పండు దొర, సురేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు ఈ కేసును చాకచక్యంగా చేదించిన పోలీసులను అభినందించి రివార్డ్లను అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img