Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుని పై ఫోక్సో కేసు నమోదు

విశాలాంధ్ర -వత్సవాయి : బలవంతంగా మైనర్ బాలికను అనుభవించి గర్భం దాల్చడానికి కారకుడు అయిన యువకునిపై మండల కేంద్రమైన వత్సవాయి లోని పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు…మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన షేక్ సుభాని ఆరు నెలల క్రితం ఆమెను బలవంతంగా అనుభవించి ఈ విషయం ఎవరికైనా చెప్పినట్లయితే చంపుతానని బాలికను బెదిరించగా ఆ బాలిక ఎవరికి ఏమి చెప్పకుండా ఉన్నది… కాలక్రమేనా ఆ బాలికలో వస్తున్న మార్పులను గమనించిన తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భవతి అని తేలింది మైనర్ బాలిక తల్లి తన కుమార్తెను అడుగగా గ్రామానికి చెందిన షేక్ సుభాని బలవంతంగా తనపై అఘాయిత్యం చేశాడని తల్లికి వెల్లడించడంతో బాధితురాలి తల్లి అరవపల్లి వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకునిపై కేసు నమోదు చేసి.. బాలికను వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించినట్లుగా స్థానిక ఎస్ఐ అభిమన్యు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img