చుండూరు సుబ్బారావు
విశాలాంధ్ర రూరల్ – నందిగామ : గత పది రోజులుగా కూర్చున్న అకాల వర్షాలు వలన తీవ్రంగా నష్టపోయిన మొక్కజొన్న మిర్చి రైతులను ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని సిపిఐ నందిగామ నియోజకవర్గ సెక్రటరీ చుండూరు సుబ్బారావు ఓ ప్రకటన ద్వారా శుక్రవారం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో గతంలో ఎన్నోసార్లు మిర్చి రైతులను ఆదుకోవాలని పలు మెమొరండాలు అందించడం జరిగిందని, ప్రభుత్వం నుండి మాత్రం కనీస స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు రైతుల పరిస్థితి ఈ తుఫాను వలన అగమ్య గోచరంగా మారిందని ఇటువంటి తరుణంలో రైతులు నిస్సహాయత కోల్పోతారని అటువంటి వారికి ప్రభుత్వం అండగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు,రైతన్న ఆరుగాలం శ్రమించి పంట కోసుకునే సమయంలో గత పది రోజులు నుండి కురుస్తున్న అకాల గాలీ వర్షాల వలన మొక్కజొన్న నేలమట్టం కావడంతోపాటు అరాకొరగా కాసిన మిర్చి రైతుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు ప్రత్తి రైతులు మార్కెట్ ధర లేక ఇప్పటికి ఇళ్లల్లో పత్తిని ఉంచుకుంటే ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు,కేంద్రం కూడా ప్రత్తి రైతుల పట్ల నిరంకుశ వైఖరి వ్యవహరిస్తుందని దిగుమతి సుంకానికి రాయితీ ఇస్తూ దేశీయ పత్తి రైతులపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని అన్నారు,భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లక్షల టన్నుల్లో ప్రత్తి నిల్వలు ఉంటే ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ప్రత్తి కి సరైన గిట్టుబాటు ధర అందించాలని,అలాగే నష్టపోయిన మొక్కజొన్న,మిరప రైతులను ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని సిపిఐ తరఫున ఆయన డిమాండ్ చేశారు