Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

కొమరగిరి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

ప్రజాదరణ పొందుతున్న కొమరగిరి ట్రస్ట్
కంటి సమస్యలు ఉన్నవారికి ఆపద్బాంధవుడిలా కనిపిస్తున్న భరద్వాజ్

విశాలాంధ్ర- వత్సవాయి: మండలంలోని మక్కపేట గ్రామంలో కొమరగిరి ట్రస్ట్, చిన్న అవుటుపల్లి పిన్నమనేని సిద్దార్థ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో మక్కపేట శ్రీ సాయి సెంచరీ హై స్కూల్ లో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు….ఈ వైద్య శిబిరం లో 80 మంది కి పైగా కంటి వైద్య పరీక్షలు చేయించుకోగా … వారిలో 11 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం రిఫర్ చేయడం జరిగింది.. వారిని పిన్నమనేని సిద్ధార్థ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక బస్ లో పంపించడం జరిగింది.. మక్కపేట గ్రామానికి చెందిన కొమరగిరి ట్రస్ట్ చైర్మన్ సవిత భరద్వాజ్ దంపతులు కంటి సమస్యలు ఉన్న వారికి చొరవ తీసుకొని మరి కంటి వైద్య పరీక్షలను చేయిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు…. కొమరగిరి ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి అహర్నిశలు ఎన్నో కార్యక్రమాల ద్వారా నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ వృద్ధులకు కంటి సమస్యలు ఉన్నవారికి సంబంధిత ఆసుపత్రుల ద్వారా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి లాభాపేక్ష లేకుండా నిస్వార్ధంగా పనిచేస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నారు కొమరగిరి భరద్వాజ్ సవిత దంపతులు ఇటువంటి దంపతులు విద్యా రంగంలో ఎంతో మందికి సేవలను అందిస్తూ… మరియు ఆరోగ్య విషయాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ మరియు మండల ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు సోమవారం నిర్వహించిన కంటి పరీక్ష కేంద్రంలో
ప్రతినిధులు కొమరగిరి సవిత, శోభ రుక్మిణి బండారు,డాక్టర్స్ జాహ్నవి, పవన్,పిఆర్వో రాఘవ మరియు సిబ్బంది పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img