Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

గుంటూరు నుంచి గుంతకల్‌ రైల్వే లైన్‌ నిర్మాణం భూముల పరిశీలన

విశాలాంధ్ర ` మహానంది : గుంటూరు నుంచి గుంతకల్‌ రెండో రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా భూసేకరణ నిమిత్తమై భూములను నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పరిశీలించారు. శనివారం మహానంది, నంద్యాల మండలాల్లో గుంటూరు నుంచి గుంతకల్‌ రెండో రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా భూసేకరణ నిమిత్తమై భూములను నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌ పాయ్‌, మహానంది మండల తహశీల్దార్‌ జనార్దన శెట్టి, నంద్యాల తహశీల్దార్‌ రవికుమార్‌, రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసులు, మండల సర్వేయర్‌ నాగశ్రీ, మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డిలతో కలిసి పరిశీలించారు. అనంతరం నంద్యాల సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ గుంటూరు నుంచి గుంతకల్‌ రెండో రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా భూసేకరణ నిమిత్తమై శనివారం మహానంది, నంద్యాల మండలాల్లోని గోపవరం గ్రామంలో 44 సెంట్లు, నందిపల్లె గ్రామ సమీపంలోని 63 సెంట్లు, నంద్యాల మండలం అయిలూరు గ్రామ సమీపంలో 17 సెంట్ల స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img