Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

డిప్యూటీ తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిన డిప్యూటీ తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు సిపిఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, రైతులు తమ సమస్యల పరిష్కారానికై నిత్యం తాహశీల్దార్ కార్యాలయానికి వస్తూ ఉంటారన్నారు. సమస్యలు పరిష్కారం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. పట్టించుకునే నాథుడే కరువయ్యారు అన్నారు. సమస్యలపై అర్జీలు ఇస్తే ప్రతి విషయాన్ని ఆర్ ఐ కి రెఫర్ చేస్తానని చెపుతూ, రైతు సమస్యలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. తాహశీల్దార్ రాజకీయ నాయకులు చెపితే గంట కూడా సమయం వృధా చెయ్యకుండ పని చేసి పెడుతున్నాడని, కానీ సామాన్య ప్రజలకు ఎవరికీ పని చెయ్యడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఇంత జరుగుతున్నా డిప్యూటీ తాహశీల్దార్ సీటుకే పరిమితం అవుతున్నారని, తక్షణమే డిప్యూటీ తహసీల్దార్ పై చర్యలు తీసుకొని, రెగ్యులర్ తాహశీల్దార్ ను నియమించాలన్నారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ మహేష్ రైతుల దగ్గర దందాలు చేస్తూ, రైతులను బెదరిస్తున్నారని, ఇలాంటి అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, డోలు హనుమంతు, చంద్ర, రామాంజనేయులు, లక్ష్మన్న, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img