Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

రైతులు సకాలంలో రుణాలు చెల్లించాలి

చైర్మన్ కట్టెల గోవర్ధన్

విశాలాంధ్ర/ ఆస్పరి : రైతులు సొసైటీ ద్వారా తక్కువ వడ్డీతో పొందిన రుణాలు తిరిగి సకాలంలో వడ్డీతో చెల్లించాలని సింగిల్ విండో చైర్మన్ కట్టెల గోవర్ధన్ కోరారు. గురువారం స్థానిక సొసైటీ కార్యాలయంలో సీఈఓ అశోక్ నాయుడు అధ్యక్షతన రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా సొసైటీ ద్వారా పొందిన రుణాలు వసూళ్లు, లావాదేవీలపై సిబ్బందితో చర్చించారు. అనంతరం చైర్మన్ కట్టెల గోవర్ధన్ మాట్లాడుతూ రైతుల సంఘాటీతం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సొసైటీ పని చేస్తుందన్నారు. రైతులు తమ పంటల సాగు అవసరాల కోసం తీసుకున్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలతో పాటు రైతు నేస్తం, రాజన్న చేయూత, క్రాప్ లోన్స్ మరియు ఎల్ టి లోన్ల కు సంబంధించి వడ్డీలను, ఈ సంవత్సరం మార్చి నెల ఆఖరిలోపు కట్టి రెన్యువల్ చేసుకోవాలన్నారు. అన్ని రకాల రుణాలను గడువులోపు సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికీ తోడ్పాటుని అందించాలని కోరారు. ఈ సమావేశంలో డైరెక్టర్ కురువ రంగన్న, క్లర్క్ నరసింహులు, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img