Friday, March 24, 2023
Friday, March 24, 2023

వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం

విశాలాంధ్ర.. ఆస్పరి : వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని ఎంపీపీ సుంకర ఉమాదేవి, వైకాపా మాజీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, చిన్న హోతూరు సర్పంచ్ హరికృష్ణ లు అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిరుమాన్ దొడ్డి గ్రామంలోని ఎంపీపీ స్వగృహం నందు వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోనే హాలహరి మండలం, నిట్రవట్టి గ్రామంలో ఈనెల 10వ తేదీన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ చేపట్టడం చాలా సంతోషించేదగ్గ విషయమని అన్నారు. వేల సంవత్సరాల క్రితమే జ్ఞానం ఒకరి సొత్తు కాదని కృషి చేస్తే జ్ఞాన సముపార్జన ఎవరికైనా సాధ్యమే అని బోయవర్గానికి చెందిన మహర్షి వాల్మీకి విషయంలో నిరూపితమైందన్నారు. ఆయన మార్గం అనుసరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img