Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎర్ర మట్టి తవ్వకాలను ఆపడంలో అధికారులు విఫలం

విశాలాంధ్ర-పెద్దకడబూరు : ఎర్ర మట్టి తవ్వకాలను ఆపడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వెంటనే ఆపాలని సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం నందు వీఆర్వో గురురాజారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ మండల పరిధిలోని చిన్నకడబూరు, కల్లుకుంట గ్రామాలలో ఎర్ర మట్టి తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే రహదారులు గుంతల మయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ఎర్ర మట్టి తవ్వకాలు ఎక్కువగా జరిగితే ప్రకృతి పూర్తిగా నశిస్తుందని, ఎర్ర మట్టి తవ్వకాలను ఆపాల్సన అధికారులే ప్రకృతికి విరుద్ధంగా నడుచుకోవడం చాలా సిగ్గుచేటు అని, ఎర్ర మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎర్ర మట్టి తవ్వకాలను ఆపి, ప్రకృతిని కాపాడాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వీఆర్వో గురురాజారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, సర్ధాజ్ పటేల్, డోలు హనుమంతు, ఆయాద్ పటేల్, గిడ్డయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img