Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

ఘనంగా శ్రీనివాస రామానుజన్‌ జయంతి

విశాలాంధ్ర ` ఆస్పరి : సంఖ్యాశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్‌ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నారాయణ ప్రైమ్‌ స్కూల్‌ లో డైరక్టర్‌ దీప్తి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ నరేష్‌ ఆచారి మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరని, శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడన్నారు. శ్రీనివాస రామానుజం గొప్పతనాన్ని, ఆయన మేథస్సు గురించి వివరించారు. విద్యార్థులు ఆయన ఆశయాల్లో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్‌ డీన్‌ సతీష్‌ కుమార్‌, ఉపాద్యాయులు అరుణ, రేష్మ, శ్వేత, రామ, గౌసియ, గంగమ్మ, రామకృష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img