Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జీఓ నెంబర్ 1ని తక్షణమే రద్దు చేయాలి

విశాలాంధ్ర- ఆస్పరి : ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతులను అణగదొక్కేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1 ని జారీ చేసిందని తక్షణమే రద్దు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు నాగేంద్రయ్య, మండల కార్యదర్శి విరుపాక్షి లు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బస్టాండ్ దగ్గర జోఓ కాపీలను దగ్దం చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నిరంకుశ నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, జీవో నెం.1 చీకటి జీవోగా చరిత్రలో నిలిచిపోతుందని, ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయకూడదు, తప్పుల్ని ఎత్తి చూపకూడదు అనడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని అన్నారు. గతంలో ప్రభుత్వ వైఫల్యాలను పత్రికలు, మీడియా బయటపెడుతున్నాయనే కక్షతో జీవో నెం.2430 తెచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు నోరెత్తకుండా చేయాలనే ఉద్దేశ్యంతో జీవో నెం.1 తెచ్చారని మండిపడ్డారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఆందోళనలు ఉధృతంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఆఅంజినయ్య, బ్రహ్మయ్య, ఉరుకుందప్ప, గోరంట్ల, రామాంజనేయ, కావలి ఉరుకుందప్ప, రంగన్న, ఏఐవైఎఫ్ అధ్యక్షులు లక్ష్మన్న, రామచంద్ర, రంగస్వామి, హమాలీ సంఘం నాయకులు చంద్ర, గాజులింగ, శీను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img