Monday, May 13, 2024
Monday, May 13, 2024

పెద్ద లక్ష్మమ్మ అవ్వ గుడి నిర్మాణానికి భూమి పూజ

విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ పెద్ద లక్ష్మమ్మ అవ్వ ఆలయ నిర్మాణానికి గురువారం శోభాకృత నామ సంవత్సరం జేష్ట మాసం ఉత్తరాయణం ద్వాదశిన భూమి పూజ నిర్వహించారు. గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పెద్ద లక్ష్మమ్మ అవ్వ నూతన ఆలయ నిర్మాణం కొరకు గ్రామ పెద్దలు మాజీ వీఆర్వో రామలింగారెడ్డి, అనసూయమ్మ లచే పురోహితులు పంపాపతి స్వామి, పెద్ద లక్ష్మమ్మ అవ్వ ఆలయ అర్చకులు విశ్వ బ్రాహ్మణ నరసింహాచారి సమక్షంలో శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వీఆర్వో కరణం కృష్ణమూర్తి స్వామి, నరవ రమాకాంతరెడ్డి, శశిరేఖ, చంద్రశేఖర్ రెడ్డి, రవి చంద్రారెడ్డి, మల్లికార్జున, విశ్వనాథ్ రెడ్డి, ఎర్రన్న, బాబు, అంజినయ్య, కేటి తిప్పన్న, పెద్ద నాగన్న, రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img