Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కౌలు రైతులను ఆదుకోవాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, కౌలు రైతు జిల్లా కార్యదర్శి తిమ్మయ్య లు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక రేయిన్ బో పాఠశాల నందు ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం ఆద్వర్యంలో కౌలు రైతు మండల స్థాయి సమావేశం రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ అధ్యక్షతన జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, కౌలు రైతు జిల్లా కార్యదర్శి తిమ్మయ్య మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో, గ్రామాల్లో ఎక్కువగా నకిలి విత్తనాల వ్యాపారం మొదలైందన్నారు. నాణ్యతలేని విత్తనాలు, లూజు విత్తనాలు అమ్ముతున్నారని ఏడిఏ, తహసిల్దార్ వీటిని నివారించడం లేదని విమర్శించారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద రుణ సౌకర్యం కల్పించాలని, దేవదాయ, ధర్మాదాయ భూములు కౌలు రైతులకు కౌలుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతు భరోసా మరియు బ్యాంకు నందు రుణమాఫీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, నాయకులు తిక్కన, డోలు అనుమంతు, వీరేష్, గోపాల్, వీరాంజనేయులు, సర్దాజ్ పటేల్, హనుమంతు, డోల్ హనుమంతు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img