Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

రైతులు మధ్య ఘర్షణ సృష్టించడంలో బజారి ముఖ్య పాత్ర

విశాలాంధ్ర, పెద్దకడబూరు :మొన్న జరిగిన రైతుల ఘర్షణలో విలేకరి బజారి ముఖ్య పాత్ర వహించాడని సిపిఐ నాయకులు జాఫర్ పటేల్, తిక్కన్న ఆరోపించారు. శనివారం వారు ఎమ్మిగనూరులో విలేకరులతో మాట్లాడుతూ కల్లుకుంట గ్రామంలోని సర్వేనెంబర్ 175/ ప, 174/1 లలో గల ప్రభుత్వ భూమిని పేదలకు చెందేటట్లు న్యాయం చేయాలని రమేష్ అనే రైతు సిపిఐ పార్టీని ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. దీంతో సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం చేయడంతో ఆర్డీఓ రెండు సర్వే నంబర్లను రెడ్ మార్కులో పెట్టారన్నారు. సర్వేనెంబర్లను అధికారులు లాక్ చేసిన తర్వాత రమేష్ 100ఎకరాల భూస్వామి లక్ష్మన్న తో చేతులు కలిపి సిపిఐ పార్టీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఏమైనా ఉంటే మాట్లాడుదామని చెప్పినా వినకుండ విలేకరి బజారి, రమేష్ లు భూస్వామితో డబ్బులు తీసుకొని పార్టీపై విమర్శలు చేస్తూ, పేదలకు దక్కాల్సిన భూములను భూస్వామి అయిన లక్ష్మన్నకు వచ్చే విధంగా వీరు గొడవలు సృష్టించారని తెలిపారు. ఇదే విషయం శుక్రవారం ప్రణాళిక ప్రకారం రమేష్, బజారి లు మా పిల్లవాడిపై దాడికి పాల్పడినారన్నారు. ఎవరెన్ని చేసినా పేద ప్రజలకు భూములు దక్కేంతవరకు మా పోరాటం ఆగదన్నారు. గొడవలు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డోలు హనుమంతు, వీరాంజినేయులు, రెక్కల గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img