Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రంథాలయాలు విజ్ఞానాన నిలయాలు

శివరాంప్రసాద్

విశాలాంధ్ర – కర్నూలు జిల్లా : నందవరం గ్రంథాలయాలు విజ్ఞానాన నిలయాలు అని గ్రంథాలయ అధికారి శివరాంప్రసాద్ అన్నారు. సోమవారం నందవరం లో స్థానిక గ్రంథాలయం నందు 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ముందుగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ను పంచాయతీ కార్యదర్శి రంగనాయకులు తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ.నేటిబాలలే రేపటి పౌరులని తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి జ్ఞానాన్ని, పుస్తక పఠనాసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని పుస్తక పఠనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారి విరూపాక్షి, గ్రంథాలయ పాఠకులు సూరి, రామాంజనేయులు, భీమన్న,వలి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img