Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పుస్తకాలు ప్రియనేస్తాలు: పట్టణ సిఐ నరసింహారావు

విశాలాంధ్ర -రాజంపేట: పుస్తకాలు ప్రియ నేస్తాలని, పుస్తకాలను చదవడం ద్వారా ప్రపంచ జ్ఞానం లభిస్తుందని పట్టణ సిఐ నరసింహారావు, ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం విశాలాంధ్ర బుక్ హౌస్ వ్యాన్ సిబ్బంది ఆధ్వర్యంలో విశాలాంధ్ర సంచార వాహనాన్ని సిఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ లభించని పుస్తకాలు విశాలాంధ్ర బుక్ హౌస్ వ్యాన్ లో లభిస్తాయన్నారు. పుస్తకాలను చదవడం ద్వారా మానసిక వికాసం ఏర్పడుతుందన్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ విజ్ఞానానికి నిలయమన్నారు. తెలుగు సాహితి వైతాళికులైన కందుకూరి, గురుజాడ, గిడుగు రామ్మూర్తి, సాహిత్యాన్ని విశాలాంధ్ర వెలుగులోకి తెచ్చిందన్నారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ ప్రచురించిన అనేక సాహిత్య గ్రంథాలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు పురస్కరించుకొని 1 నవంబర్ 2022న మంగళవారం ఉదయం ఏ-కన్వెన్షన్ సెంటర్, విజయవాడ లో వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ నగదు పురస్కారంతో పాటు మెమొంటో, ప్రశంసాపత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా అందుకోవడం సంతోషకరమన్నారు. అందుబాటులోకి వచ్చిన విశాలాంధ్ర బుక్ హౌస్ ను విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు, పుస్తక ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశాలాంధ్ర బుక్ హౌస్ వ్యాన్ ఇన్చార్జి కె వెంకటాద్రి మాట్లాడుతూ విశాలాంధ్ర ప్రచురణాలయం 1953 జనవరి 1న ఆవిర్భవించిందన్నారు.నాటి నుండి 69 సంవత్సరాలుగా అభ్యుదయ వామపక్ష సామాజిక శక్తుల సంఘిటిత పోరాటాలకు విశాలాంధ్ర వెన్ను దన్నుగా నిలుస్తూ మరోవైపు తెలుగు సాహిత్య, సాంస్కృతిక వికాసానికి సోషలిస్టు తాత్విక సాహిత్య భావాల ప్రచారానికి నిర్విరామంగా కృషి కొనసాస్తుందన్నారు. తెలుగు సాహిత్యంతో పాటు ఇంగ్లీష్ గ్రామర్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజీ, సైన్స్ పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు,నవలలు, కథలు పుస్తకాలు మరియు చిన్న పిల్లలకు సంబంధించిన పుస్తకాలు లభిస్తాయన్నారు.3 రోజుల పాటు రాజంపేట పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద విశాలాంధ్ర సంచార వాహనం స్థానికులకు అందుబాటులో ఉంటుందన్నారు. విద్యావంతులు, మేధావులు, ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్విని చేసుకున్నారు. విశాలాంధ్ర సంచార వాహన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్ టి యు నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, సిపిఐ నాయకులు మహేష్, ఎమ్మెస్ రాయుడు, సికిందర్, శివరామకృష్ణదేవరా, రవికుమార్, విశాలాంధ్ర బుక్ హౌస్ స్టాప్ శంకరయ్య, సుధాకర్,సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img