Friday, April 26, 2024
Friday, April 26, 2024

69వ అఖిల భారత సహకార వారోత్సవాల పోస్టర్ విడుదల

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురము జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్పర్సన్ ఎం. లిఖిత సహకార వారోత్సవాలు నిర్వహణకు సంబంధించి పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సి.ఇ.ఓ రాంప్రసాద్, జనరల్ మేనేజరు సురేఖారాణి, డిప్యూటి జనరల్ మేనేజరు సుఖదేవ్ • బాబు, ఆప్కాబ్ ఓ.ఎస్.డి. బి. దినేష్ కుమార్, రాయలసీమ సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసులు ఇతర బ్యాంకు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ కుమారి లిఖిత… మాట్లాడుతూ 69వ అఖిల భారత సహకార వారోత్సవాలు దేశ వ్యాప్తంగా అన్ని సహకార సంస్థలలో జరుపుకోవటం ఆనవాయితి అని ఈ వారోత్సవాలు నవంబరు 14 నుండి 20వ తేది వరకు సహకార అధికారులు నిర్ణయించిన మేరకు అన్ని సహకార సంస్థలలో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. బ్యాంకు సి.ఇ.ఒ రాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సహకార వారోత్సవాల వేడుకలు నిర్వహణకు ఈనెల 14న అధ్యక్షులు కుమారి ఎం. లిఖిత జిల్లా సహకార కేంద్రం బ్యాంకు ఆవరణలో ప్రారంభించి సహకార పతాకాన్ని ఆవిష్కరిస్తారని ఈ కార్యక్రమానికి బ్యాంకు సిబ్బంది, సహకార శాఖ అధికారులు ఇతర సహకార సంఘాల పాలకవర్గం సిబ్బంది శిక్షణ కేంద్రం సిబ్బంది, శిక్షణార్థులు హాజరై ఈ ప్రారంభోత్సవ వేడుకను జయప్రదం చేయాలన్నారు. జనరల్ మేనేజరు సురేఖరాణి మాట్లాడుతూ పండిట్ జవహార్లాల్ నెహ్రూ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజు నుండి ఒక వారంరోజుల పాటు సహకార వారోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. సహకార సంస్థలలో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఈ వారోత్సవ వేడుకలు నిర్వహించుకొని హాజరై అనంత జిల్లాలో సహకార వారోత్సవ వేడుకలు జయప్రదంచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు పాల్గొని సహకార వారోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా జిల్లా సహకార అధికారి ఎం.ప్రభాకర్ రెడ్డి . నిర్ణయించిన మేరకు ఆయా సబ్ డివిజనల్ సహకార అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా సహకార వారోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డి.జి.ఎం. శ్రీ సుఖదేవ్ బాబు , బ్యాంకు ఓ.ఎస్.డి, (అప్కాబ్) శ్రీ దినేష్ కుమార్, మేనేజర్ శ్రీ అనంత పద్మనాభం పాల్గొని వారోత్సవాల ప్రాముఖ్యతను గురించి తెలియపరిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img