Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆజాద్ మార్గదర్శకాలును విద్యార్థి అలవర్చుకోవాలి

జెఎన్టియుఏ:  మౌలానా అబుల్ కలాం ఆజాద్  మార్గదర్శకాలు ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని రెక్టర్  విజయ్ కుమార్, రిజిస్ట్రార్ సి. శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం పరిపాలన భవనంలో  మౌలానా అబుల్  చిత్ర పటానికి రెక్టార్ , రిజిస్ట్రార్  పాటు  యూనివర్సిటీ ఉన్నతాధికారులు, సిబ్బంది  పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ఈ  సందర్బంగా రెక్టార్  యం.విజయ కుమార్  మాట్లాడుతూ. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి గా విద్యార్థుల జీవితాల్లో వెలుగులను నింపిన మహనీయుడని కొనియాడారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఆజాద్ నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత, దేశ సమైక్యత స్ఫూర్తిని తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సుమలత ,  పి.ఆర్ . భానుమూర్తి ,  ఇ. కేశవ రెడ్డి ,  కిరణ్మయి , శోభా బిందు ,  సుబ్బారెడ్డి , సురేష్ బాబు , పి.ఆర్.ఓ. డా .యం. రామ శేఖర రెడ్డి,డి ఆర్ లు మధు సూధన రెడ్డి , దుర్గా ప్రసాద్ ,  అవుట్ సోర్సింగ్  సిబ్బంది    పాల్గొన్నారు.

జయంతి వేడుకలలో రెక్టర్ విజయ్ కుమార్, రిజిస్ట్రార్ సి. శశిధర్.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img