Friday, April 26, 2024
Friday, April 26, 2024

వైభవంగా ఆజాధికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం

. స్వాతంత్ర సమరయోధులు మెలవాయి గోవింద రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ
. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాల గుండ్ల, ఆర్ డి టి డైరెక్టర్ మంచు ఫెర్రర్
. 1250 అడుగుల జాతీయ మువ్వన్నెల జెండా ప్రదర్శన

విశాలాంధ్ర .గోరంట్ల .శ్రీ సత్యసాయి జిల్లా : గోరంట్ల పట్టణంలో కని విని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ఆజాధికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పెద్ద ఎత్తున శనివారం నిర్వహించారు, ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన రెడ్ఫోర్ట్ ను మైమరిపించేలా ప్రత్యేక శిలాఫలకం తో పాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్వాతంత్ర సమరయోధులు మెలవాయు గోవింద్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ఉమామహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు, మదని డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ప్రత్యేక స్వాగత కార్యక్రమం నిర్వహించారు, అలాగే విద్యార్థులు, ప్రముఖులు, యువకులు, అమృత్ మహోత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ గుప్తా ఏర్పాటుచేసిన 1250 అడుగుల మువ్వన్నెల జాతీయ జెండాను పట్టణంలో గౌరవ ప్రదర్శనగా జాతీయ ఏక్తా ర్యాలీ నిర్వహించారు, పట్టణంలోని పొట్టి శ్రీరాములు,మహాత్మా గాంధీ, వాల్మీకి, ఎన్టీఆర్, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు, అదేవిధంగా రాజ్ కన్వెన్షన్ హాల్ నందు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, పెనుకొండ శాసనసభ్యులు మాల గుండ్ల శంకర నారాయణ, ఆర్ డి టి డైరెక్టర్ మంచు ఫెర్రర్, ప్రజాపిత బ్రహ్మకుమారి పీఠం రాజయోగిని బికే సుగంధ జి, హేమ్మనూరు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు జిహెచ్ సుదర్శన్ శర్మ, హిందూపురం బాలాజీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు, అలాగే పట్టణానికి చెందిన గంధం శ్రీధర్ కుమారుడు ధీరజ్ ఏర్పాటు చేసిన ఏవి ని ప్రదర్శించారు, జిల్లా కలెక్టర్ బాలుడికి బహుమతిని అందజేశారు, ప్రత్యేక యాప్ ను ప్రారంభించారు, అలాగే జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల కమిటీ సభ్యులను అభినందించారు, విద్యార్థులు శారీరక దృఢత్వంతో పాటు పుస్తక పఠనం నిర్వహించాలని మంచి విద్యను అభ్యసించాలని గురువులను గౌరవించాలని పిలుపునిచ్చారు, అలాగే ముఖ్య అతిథులకు విశిష్ట అతిథులకు కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు, పత్రిక రంగంలో సీనియర్లుగా ఉన్న రామాంజనేయులు మరియు సురేంద్రనాథ్ లకు ఘనంగా సత్కరించారు, కార్యక్రమంలో భక్తవత్సలం, సోమశేఖర్, దామోదర్ రెడ్డి, ప్రవీణ్, రామచంద్రారెడ్డి, రెడ్డి కేశవ్ ప్రసాద్, సర్పంచ్ సరోజా నాగే నాయక్, ఎంపీపీ ప్రమీల మూర్తి, జడ్పిటిసి పాలే జయరాం నాయక్, రమా పావని రాయల్, వైస్ ఎంపీపీ రామలక్ష్మమ్మ సత్యనారాయణ, మిల్ట్రీ ఫక్రుద్దీన్, ఎస్సై ఇక్బాల్ భాష, బాబు తోపాటు పెద్ద ఎత్తున విద్యార్థులు ఉపాధ్యాయులు కమిటీ సభ్యులు పాల్గొన్నార్థు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img