Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పశువుల దాహార్తిని తీర్చడానికి చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు సమీపంలో ఉన్న 1 ఆర్, 76ఆర్ బ్రాంచ్ కాలువలకు నీరు వదలి పశువుల దాహార్తిని తీర్చడానికి చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గుల తిక్కన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనందరాజు గురువారం ఆదోని డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ ఎల్ సి దిగువ కాలువ ద్వారా సమయానుకూలంగా నీరు విడుదల చేయిస్తూ జిల్లా వ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందుస్తు చర్యలు చేపట్టినందుకు ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రబీ సీజన్ ముగిసే సమయం ఆసన్నమయిందన్నారు. కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, వాగులు, వంకలు ఎండిపోయాయన్నారు. దీంతో పశువులు, గొర్రెలు, మేకలు తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకడబూరు గ్రామం నందు సుమారు 2000 వేలకు పైగా గొర్రెలు, మేకలు, 1000 పైగా పశువుల మంద ఉన్నాయని తెలిపారు. కావున అధికారులు స్పందించి 1 ఆర్, 76ఆర్ బ్రాంచ్ కాలువలకు తాగునీటిని వదలి వాగులు, వంకలు నింపి గొర్రెలకు, పశువుల దాహార్తిని తీర్చాలని కోరారు. ఇందుకు స్పందించిన ఇంజనీర్ శైలేశ్వర్ రెడ్డి ఏప్రిల్ 11వరకు ఎల్ ఎల్ సి కాలువకు నీరు పారుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జిల్లా కమిటీ సభ్యులు మేతరి సురేష్, బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img