Monday, April 22, 2024
Monday, April 22, 2024

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు ఆధ్వర్యంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రాయడంలో అంబేద్కర్ కృషి ప్రశంస నీయమన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగు జాడలలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బజారప్ప, బాబు, ప్రజా సంఘాల నాయకులు దేవదాసు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img