Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట, చిన్నతుంబలం, మేకడోన, కంబలదిన్నె, జాలవాడి, హెచ్ మురవణి, పెద్దకడబూరు తదితర గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ శ్రీవిద్య, తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, పోలీసు స్టేషన్ లో ఎస్ ఐ మహేష్ కుమార్, సచివాలయాలలో గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారని, రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సమయం పట్టిందన్నారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అన్నారు. భారత రాజ్యాంగం రూపకర్తలు, దేశం కోసం త్యాగాలు చేసిన జాతీయ నాయకుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, సచివాలయ జేఏసీ కన్వీనర్ రవిచంద్రా రెడ్డి, ముక్కరన్న, కోస్గీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అర్లప్ప, ఎంపిడిఓ ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్ మహేష్, ఆయా గ్రామాల సర్పంచులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img