Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం, కల్లుకుంట, కంబలదిన్నె, జాలవాడి, హెచ్ మురవణి, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో సీఎస్ఐ చర్చి పాస్టర్ మనోహర్ బాబు, ఆర్ సి ఎం చర్చి ఫాదర్ సంజీవరావు ఆధ్వర్యంలో ఆయా చర్చిలలో మద్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించారు. మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాలను త్యాగం చేశారని, దీంతో మానవాళి రక్షింపబడ్డారన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల ఎడల ప్రేమ, జాలి, దయ కలిగి ఏసుక్రీస్తు అడుగు జాడలలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సంఘ పెద్దలు, మహిళలు, అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img