Friday, April 26, 2024
Friday, April 26, 2024

తిమ్మగురుడు స్వామి జాతర సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు …

విశాలాంధ్ర- గూడూరు : గూడూరు పట్టణంలో గుడ్ ఫ్రైడే మరియు జాతర సందర్భంగా పుట్టపర్తి సిఐ శ్యామారావు మరియు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ లో శుక్రవారం  చలివేంద్రం ను ఏర్పాటు చేశారు. గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరేంద్ర చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభించారు. ప్రారంభ రోజు సందర్భంగా చలివేంద్రంలో మజ్జిగను ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పుట్టపర్తి సిఐ  శ్యామారావు మాట్లాడుతూ తన సొంత గ్రామం గూడూరు మండలంలోని చనుగుండ్ల గ్రామం కావడంతో కోడుమూరు నియోజకవర్గంలోని ప్రజలకు తన వంతుగా సహకారం సేవలు అందించాలన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. గత నెల కోడుమూరు పట్టణంలో ఉచిత మెడికల్ క్యాంపులో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించామన్నారు. రాబోవు రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్  వైస్ చైర్మన్ లు పిఎన్ అస్లాం, లక్ష్మన్న, నాయకులు డి సుందర్రాజు, జె.ఆబేలు, టీచర్ కేశన్న  మరియు గూడూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వి. నరేంద్ర ప్రసాద్, స్థానిక జి ఈశ్వరప్ప, జి మల్లికార్జున, ఉగ్ర నరసింహులు, నీలయ్య, కుమ్మరి స్థానిక నేతలు శివ రాముడు, మునీర్ భాష, ఎం శ్రీనివాసులు, కాకెన్న, ఎం ఎల్లప్ప, హమాలి సంఘం నాయకులు, రంగన్న సుధాకర్ గౌండ సంఘం ప్రెసిడెంట్ పైగేరి మధు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img