Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టర్కీ కమ్యూనిస్టు కవి ‘హిరోషిమా చైల్డ్‌’

నేను ప్రతి వారి ద్వారం వద్దకు వచ్చి నిలబడతాను
కానీ నా నిశ్శబ్ద నడకను ఎవరూ వినలేరు
నేను తలుపు తట్టాను అయినా నేను కనిపించను
ఎందుకంటే నేను చనిపోయాను కాబట్టి..
నేను చనిపోయినా నాకు ఏడేళ్లు
చాలా కాలం క్రితం హిరోషిమాలో
నాకు అప్పటిలాగే ఇప్పుడు ఏడేళ్లు
పిల్లలు చనిపోతే ఎదగరుకదా..
సుడులు తిరుగుతున్న మంటల్లో నా జుట్టు కాలిపోయింది
నా కళ్లు మసకబారాయి
మృత్యువు వచ్చి నా ఎముకలను దుమ్ముగా మార్చింది
అది గాలి ద్వారా చెల్లాచెదురైంది
నాకు పండ్లు, అన్నం అవసరం లేదు
నాకు మిఠాయిలు, బ్రెడ్‌ కూడా అవసరం లేదు
నేను నా కోసం ఏమీ అడగను
నేను చనిపోయాను ఎందుకంటే నేను చనిపోయాను
నాకు కావలసింది శాంతి
మీరు ఈరోజు పోరాడండి..పోరాడండి
ఎందుకంటే ఈ ప్రపంచంలోని పిల్లలు
జీవించేందుకు,పెరిగేందుకు,నవ్వేందుకు, ఆడుకునేందుకు

1956 లో టర్కీ కమ్యూనిస్టు కవి నజీమ్‌ హిక్మత్‌ రాసిన ‘‘హిరోషిమా చైల్డ్‌’’ (ది లిటిల్‌ గర్ల్‌) అనే ఈ కవిత 20 వ శతాబ్దపు అత్యంత అనాగరిక, నేరాల భయానకతను సూచిస్తుంది. హిరోషిమా, నాగసాకిలో అమెరికా సామ్రాజ్యవాదులు 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో అణుబాంబు దాడి చేయడం మానవ జాతి చరిత్రలోనే అత్యంత ఘోర పరిణామం. నజీమ్‌ హిక్మత్‌ 20 వ శతాబ్దపు టర్కీ అగ్రశ్రేణి కవిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన కవితలు యాభై భాషల్లోకి అనువదించారు. హిక్మత్‌ ప్రసిద్ధ రచనలు ‘హ్యూమన్‌ ల్యాండ్‌స్కేప్స్‌ ఫ్రమ్‌ మై కంట్రీ,’ ‘ది ఎపిక్‌ ఆఫ్‌ షేక్‌ బెడ్‌రెడ్డిన్‌’ ‘ఆన్‌ లివింగ్‌’ ప్రసిద్ధమైనవి.
`రోమిల

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img