Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వెలుగు బాట

ఎన్ని కత్తిపోట్లైనా
దేహాన్నే గాయపరుస్తాయి
అవిశ్రాంతమైన ఆలోచనల్ని కాదు
ఎన్ని ఆటుపొటులైనా
తీరాలను భయపెడతాయి
సమస్త భూమండలాన్ని కాదు
ఎన్ని ఈదురు గాలులైనా
ఎండుటాకులను పండుటాకుల్నే రాలుస్తాయి
పదిలమైన పత్రాల పత్రహరితాన్ని కాదు
ఎన్ని నిరంకుశ శరాలైనా
మాటల్ని అణగదొక్కుతాయేమో
ఉబికే ధిక్కార స్వరాలను కాదు
దోపిడి చీకటి గుహలో చిక్కిన దీనుడు
ఎప్పటికీ అక్కడే అలాగే మగ్గిపోడు
పుడమిని చీల్చుకు వచ్చే విత్తనంలా
చైతన్యం చిగురంతైనా చిగురిస్తుంది చూడు
తమస్సును ఛేదించుకునే
ఉషస్సూ ఉదయిస్తుంది
గుర్రుపెట్టే పుర్రెలకు
ఎన్నిదుర్భుద్దులు మొలిచినా
స్వేచ్ఛా వాక్కుల్ని సాధించుకునే హక్కుల్ని
మానవత్వాన్ని ..మనిషితనాన్నీ నిషేధించటం
ఏ తంత్రానికీ ఏ కుతంత్రానికీ సాధ్యంకాదు
ప్రకృతి పాఠాలు
చరిత్ర గుణపాఠాలు మరువొద్దు
పోరాటం ఎగురుతున్న ఎర్రని జెండైనప్పుడు
సిద్దాంతం దీవిస్తున్న దీపస్తంభమైనప్పుడు
వెలుగుబాటను ఆపడం ఎవడితరం..!?
`డా.కటుకోరa్వల రమేష్‌,
సెల్‌: 9949083327

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img