Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మానవాభ్యుదయానికి రహదారి

దేశభక్తి కన్నా మానవత్వం మిన్ననీ/ విశ్వ వేదికపై ప్రపంచ గీతికని ఆలపించి/ ప్రేమ పుష్పాలను భూగోళంపై వెదజల్లాలి/ ఇక కదులు కదిలించు/ మానవాభ్యుదయం వైపు/ వడివడిగా అడుగులేద్దాం/ అంటారు కవి (పుట28) మానవాభ్యుదయంపై దృష్టి అందరికి ఉండాలి. అభ్యుదయం అంటే ప్రగతి. ఆ మార్గాన పయనించటమే మానవాభ్యుదయం. అడుగు ముందుకు పడితేనే అభ్యుదయం బాట కన్నులకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఈనాడెక్కడ చూసినా యుద్ధ భేరీలు మోగుతున్నాయి. జనావళి భయపడి పరుగులు పెడుతుంది. శాంతికోసం జనసేన కదలాలి. సమరాన్ని కాలదన్నాలి. ఆనాడే బాధిత జనావళికి ఉషోదయ మవుతుంది. కంపుకొట్టు కవిత్వమింక కట్టిపెట్టు/ నవ చైతన్యపు బావుటాను ఎత్తిపట్టు/ సమతా మమతలకే పట్టం కట్టు (పుట32) మనో చాంచల్యం కలిగి అర్థంలేని కవితలు రాస్తారు. అభ్యుదయం కాంక్షిస్తూనే కలం కదిపితే కవిత్వం నిండుగాఉంటుంది. ఉగ్రవాదం పెచ్చు పెరిగింది. దీన్ని పూర్తిగా అణచాలి. ప్రభుత్వానికి జనులు సాయపడితేనే ఉగ్రవాదం అదఃపాతాళానికి పోతుంది.
గెల్లి రామమోహనరావు, 0863 2357514

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img