Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

స్థాయీభావం

డా. ఎన్‌. గోపి
అన్నిటికీ
ఉత్సాహమే మూలం
అది కొంత
ఆరోగ్యం నుంచి ఎగిసి పడుతుంది.
మరికొంత
ఆనందం లోంచి,
అదే చోదకశక్తి.
బయట అంతా స్లో మోషన్‌లో
ఒక తరగని జ్ఞాపకం కదుల్తుంది
నేను మొత్తంగానూ పల్లెగా మిగల్లేదు
నగరం పూర్తిగా నాలో పట్టలేదు
రెండూ లోపల ఒరుసుకుంటూ జీవిస్తాయి
బహుశా నా కవిత్వానికి
ఆ వేడి కారణం కావచ్చు.
గోడ మీద
పాత ఫోటోలు మాయమై
కొత్తవి రావడం సుఖంగా వుండదు.
నిజానికి
అంత జాగా కూడా లేదు
రెండిరటి హక్కుల కోసం
వాదించే వకీలుగా
పుడుతుంది కవిత్వం
తరచూ వాయిదాలు పడుతూ
కేసు ఎప్పటికీ ఓ కొలిక్కి రాదు.
ఒక గ్లూమీ వాతావరణం,
భ్రమావరణంలో నడిచే
శ్రమజీవిలా సాగుతుంది నా కవిత్వం.
కాగితమ్మీద
ఓ నాలుగు మాటలు గిలికితే
ఎక్కడెక్కడి ఆలోచనల్నో
ఒక్క చోట కుప్ప వోసినట్టు.
ఏదో సాధించినట్టు
అవును!
ఉత్సాహమే దాని ఆయువుపట్టు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img