London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

అత్యంత వేగంగా దేశ ఆర్థికాభివృద్ధి

ఆర్థికమంత్రిత్వశాఖ నివేదిక వెల్లడి

న్యూదిల్లీ : ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ నివేదిక వెల్లడిరచించింది. కరోనా టీకా పంపిణీ వేగవంతం, పుష్కలంగా పండుగలు దేశంలో కొనసాగుతున్న పునరుద్ధరణకు తోడ్పడతాయి. దీని ఫలితంగా డిమాండ్‌-సరఫరా అసమతుల్యత తగ్గిపోయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రిత్వ శాఖ రూపొందించిన నెలవారీ ఆర్థిక నివేదిక తెలిపింది. ‘వ్యాపార అవకాశాల సంకేతాలు, వ్యయ మార్గాల విస్తరణ ద్వారా భారతదేశ ఆర్థిక పునరుద్ధరణ కు ఓ రూపంఇవ్వడంలో, ప్రధాన నిర్మాణాత్మక సంస్కరణలను సంగ్రహించడంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ మిషన్‌ కీలక పాత్ర పోషిస్తోంది’ అని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో విడుదలయిన 2020-21ఆర్థిక సర్వే , మార్చి 2022తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. సంస్కరణలు, నిబంధనల సడలింపుల వంటి చర్యలు, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ఊతం, ఉత్పత్తి సంబంధ ఇన్సెంటివ్‌ (పిఎల్‌ఐ) పథకాల ద్వారా ఉత్పాదక రంగానికి ప్రోత్సాహం, డిమాండ్‌ పునరుద్ధరణ, విచక్షణ వినియోగం పెరగడం ద్వారా వృద్ధికి మద్దతు లభిస్తుందని సర్వే పేర్కొంది. దీపావళి పండుగ సీజన్‌లో అమ్మకాలు ఒక దశాబ్దపు అత్యధిక స్థాయికి (రూ. 1.3 లక్షల కోట్ల) వెళ్లినట్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ పేర్కొంది. కోవిడ్‌`19 పరిస్థితి మెరుగవడంతో అధిక వ్యాపారం, వినియోగదారుల ఉత్సాహం వెరసి 2021 అక్టోబరులో కూడా స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణ జరిగింది. అయితే దీర్ఘకాలిక సరఫరా పరిమితులు, ఇన్‌పుట్‌ కాస్ట్‌ ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం పడుతోందని నివేదిక వివరించింది. అధిక విస్తీర్ణంలో రబీ సాగు, మెరుగైన రిజర్వాయర్‌ స్థాయిలు, తగిన స్థాయిలో ఎరువులు, విత్తనాల లభ్యతతో వ్యవసాయ రంగం ఆర్థిక పునరుద్ధరణలో బలమైన ఉనికిని కొనసాగిస్తోందని పేర్కొంది. వ్యవసాయ-ఎగుమతుల్లో స్థిరమైన పెరుగుదల కనిపించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక వివరించింది.
వచ్చే వారం బ్యాంకులు, ఎఫ్‌ఐల అధిపతులతో ఆర్థికమంత్రి భేటీ
కోవిడ్‌ మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక రంగాలకు రుణ ప్రవాహంలో ఇబ్బందులను తొలగించడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే వారం బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు.
నవంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల సదస్సులో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు (ఎఫ్‌ఐలు) పాల్గొంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, టాటా క్యాపిటల్‌తో సహా ఆరు అగ్రశ్రేణి ప్రైవేట్‌ రుణ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బిఎఫ్‌సి)ల సీఈఓలు కూడా సదస్సుకు హాజరవుతారు. రెండు రోజుల సదస్సు ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో అతుకులు లేని పద్ధతిలో రుణాల ప్రవాహంపై దృష్టి పెడుతుందని బ్యాంకులు, ఆర్థిక సంస్థల చైర్మన్లు, సీఈఓలకు రాసిన లేఖలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వారి రుణ కార్యకలాపాలు అభివృద్ధి చెందాయి’’ అని లేఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img