Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

అసెంబ్లీ ఎన్నికలకు కులం రంగు : మాయావతి

లక్నో : త్వరలో జరగబోయే ఎన్నికలకు మతం, కులం రంగు పులమాలని బీజేపీ, ఎస్పీ యత్నిస్తున్నాయని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి శుక్రవారం విమర్శించారు. వారి ఆలోచనలకు ప్రజలు వ్యతిరేకమని మాయావతి ట్వీట్‌ చేశారు. ‘త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కులమతాలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నాయో చూస్తున్నాం. దురదృష్టవశాత్తు మీడియా కూడా ఆదే బాట పట్టింది. ఇదంతా కేవలం బీజేపీ, ఎస్పీ కలిసి ఈ ఎన్నికలకు కులం, మతం రంగు పులమాలని చూస్తున్నాయి. ప్రజలు జాగురూకతతో వ్యహరించాలి’ అని ఆమె కోరారు. ఫిబ్రవరి 10న ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img