Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఆల్ట్‌ న్యూస్‌ సహవ్యవస్థాపకుడు జుబేర్‌కు బెయిల్‌ మంజూరు

ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబేర్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ఢల్లీి కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ జుబైర్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణ చేపట్టిన ఢల్లీిలోని పాటియాలా హౌజ్‌ కోర్టు తాజాగా శుక్రవారం మరోమారు విచారణ చేపట్టింది. తాజా విచారణ సందర్భంగా జుబైర్‌, ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు జుబైర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. జుబైర్‌కు బెయిల్‌ ఇవ్వరాదన్న ప్రభుత్వ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానన్న జుబైర్‌ తరఫు వాదనలపై విశ్వాసం వ్యక్తం చేసిన కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.రూ. 50వేల బెయిల్‌ బాండ్‌, ఆ మొత్తానికి ఒక పూచీకత్తుపై జుబేర్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. అలాగే, ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img