Monday, March 20, 2023
Monday, March 20, 2023

ఆస్పత్రిలో చేరిన నవాబ్‌ మాలిక్‌

ముంబై: వైద్య కారణాలతో మహారాష్ట్ర మంత్రి, ఈడీ అరెస్టు చేసిన నవాబ్‌ మాలిక్‌ స్థానిక జేజే ఆస్పత్రిలో శుక్రవారం చేరినట్టు అధికారులు తెలిపారు. ‘ఈడీ కస్టడీలో ఉండగా, మంత్రి మాలిక్‌ తనకు ఆరోగ్యపరమైన సమస్యలున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబ్బందికి చెప్పారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించాం’ అని అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర మైనార్టీ మంత్రి నవాబ్‌ మాలిక్‌ను బుధవారం ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img