Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ఇది ప్రగతిశీల బడ్జెట్‌

బడ్జెట్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్‌ ద్వారా అనేక రంగాలకు లబ్ధి చేకూరిందని..ఇది ప్రగతిశీల బడ్జెట్‌ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. వందేళ్ల ఏళ్ల తీవ్ర విపత్తు మధ్య ఈ బడ్జెట్‌ అభివృద్ధిపై కొత్త విశ్వాసాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాల కొత్త అవకాశాలతో ఈ బడ్జెట్‌ నిండుగా ఉందన్నారు. ఇది గ్రీన్‌ ఉద్యోగాల రంగం కూడా తెరవడం జరుగుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలకు పర్వతమాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రణాళిక పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థను సృష్టిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.ఈ బడ్జెట్‌ మరిన్ని మౌలిక సదుపాయాలు, ఎక్కువ పెట్టుబడులు, మరింత వృద్ధి, మరిన్ని ఉద్యోగాల కొత్త అవకాశాలతో నిండి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. గత కొన్ని గంటలుగా చూస్తున్నాను, ఈ బడ్జెట్‌కు ప్రతి రంగంలోనూ ఆదరణ లభిస్తున్న తీరు, సామాన్యుల నుంచి వస్తున్న సానుకూల స్పందన ప్రజలకు సేవ చేయాలనే ఉత్సాహాన్ని పెంచిందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img