Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఈ నెల 12 నుంచి మొగల్‌ గార్డెన్‌ సందర్శనకు అనుమతి

రాష్ట్రపతి భవన్‌
న్యూదిల్లీ:పర్యాటకుల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్‌లోని మొగల్‌ గార్డెన్‌ ఈ నెల 12 నుంచి మార్చి 16 వరకూ అందుబాటులో వుంటుందని రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అడ్వాన్స్‌ ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రమే మొగల్‌ గార్డెన్స్‌ సందర్శనం కోసం అనుమతిస్తామని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తామని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం సందర్శకులకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. సందర్శకులందరూ కోవిడ్‌ నిబంధనలను పాటించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img