Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఐసీఎస్‌ఈ, ఐఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల

ఐసీఎస్‌ఈ, ఐఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి సోమవారం ఐసీఎస్‌సీ 10వ తరగతి, ఐఎస్‌ఈ 12వ తరగతి సెమిస్టర్‌ 1 పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ సెమిస్టర్‌ పరీక్షలను గతేడాది నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 16 వరకు నిర్వహించారు. ఇక ఐఎస్‌సీ పరీక్షలను నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 20 వరకు నిర్వహించారు.పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎస్‌ఎమ్‌ఎస్‌ సేవల ద్వారా కూడా విద్యార్థులు ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. కాగా పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలతో కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img