కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవి ప్రమాణంస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్..బసవరాజ్ బొమ్మైచే ప్రమాణ స్వీకారం చేయించారు. బసవరాజు బొమ్మై వయసు 61 ఏళ్లు. బీఎస్ యడియూరప్ప (యెడ్డీ) ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు.శాసనసభా పక్ష సమావేశంలో బొమ్మై పేరును యెడియూరప్ప ప్రతిపాదించగా పలువురు బలపరిచారు.