Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

క్రికెటర్‌ యువరాజ్‌కు నోటీసులు ఇచ్చిన గోవా ప్రభుత్వం

మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు గోవా పర్యాటక శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లాకు రిజిస్ట్రేషన్‌ చేయకుండానే వాడుకుంటున్నట్లు యువీపై ఫిర్యాదు నమోదు అయ్యింది. అయితే ఈ కేసులో డిసెంబర్‌ 8వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది. హోమ్‌స్టేగా వాడుతున్న విల్లాకు గోవా పర్యాటక శాఖ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. కాసా సింగ్‌ అని ఆ విల్లాకు యువీ పేరు పెట్టుకున్నాడు.నార్త్‌ గోవాలో ఉన్న ఆ విల్లాకు నవంబర్‌ 18వ తేదీన నోటీసులు ఇచ్చారు. ప్రాపర్టీని రిజిస్టర్‌ చేసుకోలేదు కాబట్టి, లక్షరూపాయలు జరిమానా కట్టాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎయిర్‌బీఎన్బీ లాంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో యువీ తన విల్లాను హోమ్‌స్టేగా చూపిస్తున్నాడని, అలాంటప్పుడు ఆ బిల్డింగ్‌ను ఎందుకు రిజిస్టర్‌ చేసుకోవడం లేదని గోవా పర్యాటక శాఖ ప్రశ్నించింది.ఒకవేళ డిసెంబర్‌ 8వ తేదీ లోపు యువీ వివరణ ఇవ్వకుంటే, అప్పుడు జరిమానా విధించడం ఖాయమని గోవా ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img