Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

జమ్మూకశ్మీరలో ఎన్‌కౌంటర్‌..ఉగ్రవాది హతం


జమ్మూకశ్మీరలో షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున భద్రతా దళాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.రఖామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని అందిన సమాచారం మేర జమ్మూకశ్మీర్‌ పోలీసులు కేంద్ర భద్రతా జవాన్లతో కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజామున గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించడంతో ఓ గుర్తు తెలియని టెర్రరిస్టు హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదుల కోసం కేంద్ర భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img