test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ట్విట్టర్‌లో ఆనంద్‌ మహీంద్రా రికార్డ్‌.. కోటి దాటిన ఫాలోవర్స్‌ సంఖ్య

ట్విట్టర్‌లో రికార్డు సృష్టించారు ప్రముఖ పారిశ్రామికవేత్త..మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా.. ఆయన ఫాలోవర్ల సంఖ్య కోటిని దాటింది. పారిశ్రామికవేత్తలకు సమయం ఎంతో విలువైనది. అయినప్పటికీ ఆయన ట్విట్టర్‌ వేదికగా సమాజంతోనూ కొంత సమయం పాటు మమేకం అవుతుంటారు. తన దృష్టికి వచ్చిన అరుదైన విశేషాలను షేర్‌ చేస్తుంటారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చే వాటిని పరిచయం చేస్తుంటారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం కూడా ఆయన హాబీ. అదే ఆనంద్‌ మహీంద్రాకు ఉన్న విలక్షణ ప్రత్యేకత. అదే కోటి మందికి ఆయన్ను చేరువ చేసిందని చెప్పుకోవాలి.ఇంత పెద్ద కుటుంబం ఉందంటే నమ్మలేకపోతున్నాను. ఇది స్పష్టంగా కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుంది. మీ ఆసక్తి, నా పట్ల మీరు చూపిస్తున్న నమ్మకానికి మీ అందరికీ పెద్ద ధన్యవాదాలని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఇది మానవత్వానికి నిదర్శనం. ఓ వ్యాపారవేత్త జీవితం కేవలం కంపెనీ బోర్డు రూమ్‌ లు, కుటుంబానికి పరిమితం చేయకుండా.. చిన్న చిన్న విషయాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఇతరులు సైతం ఆశావహంగా జీవించేలా ప్రోత్సహించొచ్చు అనే దానికి నిదర్శనం అంటూ ఓ నెటిజన్‌ స్పందన వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img