Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

పుల్వామా దాడికి మూడేళ్లు.. అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులు

సరిగ్గా మూడేళ్ల క్రితం (2019 ఫిబ్రవరి 14న) భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కశ్మీర్‌లోని పుల్వామావద్ద పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటు వేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కాగా ఈ నెత్తుటి మరకకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా అశ్రునివాళులు అర్పిస్తోంది. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడేళ్ల క్రితం నాటి చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘2019లో పుల్వామా దాడిలో అమరులైనవారందరికీ నా నివాళి. దేశానికి వారు అందించిన విశిష్ఠ సేవలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. జవాన్ల ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలుస్తాయి’ అంటూ జవాన్లకు నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img