Monday, April 22, 2024
Monday, April 22, 2024

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం : మమతా

తన ఢల్లీి పర్యటన ఫలవంతమైందని ఐదు రోజుల ఢల్లీి పర్యటనను విజయంతంగా ముగించుకున్న సందర్భంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఇకపై తాను రెండు నెలలకోసారి ఢల్లీిలో పర్యటిస్తానని వెల్లడిరచారు. బీజేపీని అధికారం నుంచి కూలదోసేంత వరకు ‘’ఖేలా హాబ్‌’ కొనసాగుతుందన్నారు. ప్రతిపక్ష నేతలతో విస్తృత భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తన ఢల్లీి పర్యటన ఫలవంతమైందని ‘సేవ్‌ డెమోక్రసీ, సేవ్‌ కంట్రీ’ తన నినాదమని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని చెప్పారు. దేశ రాజకీయ పరిస్థితులపై శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించామని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img