Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

బీజేపీ ఎమ్మెల్యేను తరిమి కొట్టిన స్థానికులు

న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌సింగ్‌ సైనీకి ఘోర అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఆ ఎమ్మెల్యేను నియోజకవర్గ ప్రజలు వెంటపడి తరిమారు. నియోజకవర్గంలోకి రావద్దంటూ నినాదాలు చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. డ్రైవరు సైతం కారు దిగి పారిపోయాడు. విక్రమ్‌సింగ్‌ సైనీ ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతాలీ నియోజకవర్గ ఎమ్మెల్యే. రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆయన నియోజకవర్గానికి వెళ్లారు. ఈ ఘటన బుధవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. స్థానికులు ఆగ్రహంతో ఎమ్మెల్యే కారుపై దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ సర్కారు రైతులకు వ్యతిరేకంగా మూడు వివాదాస్పద సాగు చట్టాలు తీసుకురావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ చట్టాలు రద్దు చేసుకున్నప్పటికీ రైతులు దీనిని మర్చిపోలేకపోతున్నారు. ఎమ్యెల్యేపై దాడికి ప్రధానంగా రైతు చట్టాలేనని భావిస్తున్నారు. తనపై స్థానికులు దాడి చేయడంపై ఎమ్మెల్యే సైనీ స్పందిస్తూ మద్యం సేవించి కొంతమంది అల్లరి చేశారని చెప్పుకొచ్చారు. సైనీ గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హింసను ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. ఈ విషయాలను ప్రజలు మర్చిపోలేదు. దీంతో ఇప్పుడు ప్రచారం సందర్భంగా ఆయన కారుపై దాడి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img