Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

మహిళలపై ద్వేష ప్రసంగం కేసులో యతి నరసింహానందకు బెయిల్‌

అల్మోరా : మహిళలకు వ్యతిరేకంగా అవమానకరమైన, దిగజారుడు వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ పూజారి యతి నరసింహానందకు ఉత్తరాఖండ్‌ కోర్టు ఒకటి మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. హరిద్వార్‌లో వివాదాస్పద ‘ధర్మ సంసద్‌’కు నాయకత్వం వహించిన ఈ పూజారి జనవరి 19న స్థానిక సీజేఎం కోర్టు బెయిల్‌ మంజూరుకు నిరాకరించింది. కాగా మంగళవారం అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి భరత్‌ భూషణ్‌ పాండే కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా నరసింహానందకు బెయిల్‌ను మంజూరు చేశారు. ఈ హిందూ పూజారి సామాజిక మాధ్యమాలపై ముస్లిం మహిళలను కించపరిచేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. తదనంతరం, అతనిపై 295ఎ (మతపరమైన భావాలను కించపరిచేలా ఉద్దేశపూర్వక చర్యలు), 509 (మహిళలను అవమానించడం) కింద కేసు నమోదయింది. ఘజియాబాద్‌లోని దాస్నా ఆలయ పూజారి నర్సింహానంద్‌ అనేక ఇతర వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్నారు. ముస్లింలపై హింసకు పిలుపునిస్తూ నినాదాలు చేసిన హరిద్వార్‌ కార్యక్రమంపై నమోదయిన ఎఫ్‌ఐఆర్‌లలో పేరున్న మరో 10 మందిలో ఆయన కూడా ఉన్నారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై గత ఏడాది యతి నర్సింహానంద్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మహిళా రాజకీయ నాయకులపై అతని స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గతంలో నర్సింహానంద్‌ కోసం డబ్బు వసూలు చేసే కపిల్‌ మిశ్రా వంటి బీజేపీ సభ్యుల నుండి కూడా బలమైన ఎదురుదెబ్బకు దారితీసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img