Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కరోన బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన కార్యాలయం శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ఎనభై ఎనిమిదేళ్ల దేవెగౌడ భారతదేశ 12వ ప్రధానిగా 1996 జూన్‌ నుంచి 1997 ఏప్రిల్‌ వరకూ సేవలందించారు. 1994 నుంచి 1996 వరకూ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కర్ణాటకలోని హసన్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేడీ(ఎస్‌) జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img