https://www.fapjunk.com https://pornohit.net london escort london escorts buy instagram followers buy tiktok followers Ankara Escort Cialis Cialis 20 Mg
Sunday, February 25, 2024
Sunday, February 25, 2024

మినీసెక్రటేరియట్‌ ఘెరావ్‌కు రైతుల యత్నం

భద్రతా వలయంగా కర్నాల్‌ అధికారులతో చర్చలు విఫలం

కర్నాల్‌ : హరియాణాలోని కర్నాల్‌లో మంగళవారం కిసాన్‌ మహాపంచాయత్‌కు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. ఆగస్టు 28న లాఠీచార్జికి నిరసనగా మినీ సెక్రటేరియట్‌ ఘెరావ్‌కు రైతులు నడుం బిగించగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో 11 మంది రైతుల బృందంతో అధికారులు చర్చలు జరుపుగా అవి అసంతృప్తిగా ముగిసినట్లు రైతు నేతలు తెలిపారు. బీకేయూ నేత రాకేశ్‌ తికైత్‌తో పాటు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సీనియర్‌ నేతలు బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, దర్శన్‌ పాల్‌, యోగేంద్ర యాదవ్‌, గుర్నామ్‌ సింగ్‌ చౌధునిలు మహా పంచాయత్‌లో పాల్గొన్నారు. ఆగస్టు 28న రైతులపై పోలీసుల లాఠీచార్జిని ఖండిరచారు. కారకులపై చర్చలు తీసుకోవాలని డిమాండు చేశారు. జిల్లా అధికారులతో చర్చల్లోనూ రైతు నేతలు పాల్గొని వేర్వేరు అంశాలపై చర్చించారు. ఇదే విషయాన్ని కర్నాల్‌ డిప్యూటీ కమిషనర్‌ నిశాంత్‌ కుమార్‌ యాదవ్‌ పీటీఐకి ఫోన్‌ ద్వారా వెల్లడిరచారు. సెక్రటేరియట్‌ ఘెరావ్‌కు రైతులు సిద్ధం కాగా కర్నాల్‌లో పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. కేంద్ర బలగాలనూ రంగంలోకి దించారు. న్యూ అనాజ్‌ మండీలో రైతుల మహా పంచాయత్‌ నిర్వహించడంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారని అధికారులు తెలిపారు. దిల్లీకర్నాల్‌`అంబాలా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు మాత్రం అంతరాయం కలగలేదన్నారు. శాంతియుతంగా సమావేశమవుదామని అందరూ అనాజ్‌ మండీకి చేరుకోవాలని రైతులకు బీకేయూ (చౌదుని) హరియాణా అధ్యక్షుడు గుర్నామ్‌ సింగ్‌ చౌదుని ఇంతకుముందే పిలుపునిచ్చారు. ఈ మహా పంచాయత్‌లో భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామని వీడియో సందేశంలో వెల్లడిరచారు. అయితే కొందరు లాఠీలు, ఇనుప రాడ్లతో అనాజ్‌ మండీకి చేరుకున్నట్లు హరియాణా పోలీసులు, కర్నాల్‌ జిల్లా యంత్రాంగం ప్రకటనలు వెలువరించాయి. దురుద్దేశంతో వచ్చిన వారిని వెనక్కి పంపాలని రైతు నేతలతో చర్చించగా వారు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తులు వినలేదని పోలీసులు, జిల్లా యంత్రాంగం చేసిన ప్రకటనలు పేర్కొన్నాయి. మినీ సెక్రటేరియట్‌ వద్ద పహారా పెంచి భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు. మినీ సెక్రటేరియట్‌ ఘెరావ్‌కు రైతులు పిలుపునివ్వడంతో కేంద్ర భద్రతా బలగాలను జిల్లాలో మోహరించడమే కాకుండా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసి, ప్రజలు గుమ్మిగూడకుండా నిషేధాజ్ఞలను అధికారులు జారీచేశారు. సోమవారం 12.30 గంటల నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను కురుక్షేత్ర, కైథల్‌, జింద్‌, పానిపట్‌ జిల్లాల్లో నిషేధించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల 10 కంపెనీలతో పాటు 40 భద్రతా బలగాల కంపెనీలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. కర్నాల్‌ జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉందన్నారు. చౌదుని మాట్లాడుతూ, సోమవారం జిల్లా అధికారులతో చర్చలు అసంతృప్తిగా ముగియడంతో మంగళవారం మహా పంచాయత్‌కు శ్రీకారం చుట్టినట్లు వెల్లడిరచారు. ఆగస్టు 28న రైతులపై లాఠీచార్జ్‌ చేసిన వారిపై కేసు పెట్టాలని, లాఠీ దెబ్బలకు ప్రాణాలు విడిచిన రైతు కుటుంబానికి రూ.25 లక్షల చొప్పుణ నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండు చేశారు. అయితే రైతు మృతికి గుండెపోటు కారణమని పోలీసుల లాఠీలు కాదంటూ జిల్లా యంత్రాంగం సమర్థించుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img